నమస్తే శేరిలింగంపల్లి: ధ్వని కాలుష్యం రేపటి సమస్త జీవరాశికి భయంకరమైన శత్రువుగా మారనుంది. ధ్వని/శబ్ధ కాలుష్యం లక్షల మందిపై ప్రభావం చూపుతుంది. ధ్వని కాలుష్యం వల్ల పక్షులకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు వినికిడీ సమస్యలు తల్లెత్తుతాయి. అంతేకాదు నరాలమీద అధిక ఒత్తిడి పెరిగి హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, నిద్రలేమి తదితర సమస్యలు వస్తాయి. ధ్వనిని డెసిబెల్(డీబీ)లలో కొలుస్తారు. చిటిక వేస్తే 30 డీబీలు, మనిషి మాట్లాడితే 60 డీబీల శబ్ధం ఉత్పన్నమవుతుంది. ఐతే 70 డీబీ కంటే ఎక్కువ శబ్ధం మానవ శరీరానికి చేటు చేస్తుందని నిపుణులు పేర్కొంటుండగా ఇప్పటికే మనుషుల చుట్టు 120 డీబీల శబ్ధం కొనసాగుతుందని అంచనా.
పట్టణాలలో రోజువారి కార్యకలాపాల వల్ల అధిక ధ్వని కాలుష్యం ఏర్పడి మానవులపై తీవ్ర ప్రభవం పడుతుంది. ధ్వని కాలుష్యం కారణంగా పక్షులు రాత్రి పూట రాగాలు(శబ్ధాలు) తీస్తాయి. ఆ శబ్ధాలతో వాటి సహచరులకు సందేశాలు పంపిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వాటి మధ్య ప్రసారాలు దెబ్బతింటాయి. దీంతో వాటికి ప్రశాంతత కరువై, ఆహారలోపం ఏర్పడుతుంది. చివరకి ఆ ప్రభావం యావత్ పక్షుల జాతి పైన పడుతుంది. ఈ క్రమంలో సాదారణ పక్షి జాతులు సైతం అంతరించి అరుదైన జాతులుగా పరిగణించ బడుతున్నాయి. రోజు వచ్చే ట్రాఫిక్ శబ్ధాలు, వ్యాపారులు వాడే మైక్ సౌండ్ లాంటి అధిక డీబీ శబ్ధాలు పక్షులలో తీవ్రమైన జన్యు పరిణామాలకు దారితీస్తున్నాయి. శబ్ధం వల్ల జంతువుల మధ్య జరిగే సంభాషణల్లోను ఇబ్బంది ఏర్పడుతుంది.
శబ్ధ కాలుష్యం పెద్దలు, పిల్లలపైనా తీవ్ర ప్రబావం చూపుతుంది. పెద్దవారిలో హైపర్‌టెన్సన్, చిన్నపిల్లల్లో మేధోశక్తి క్షీణించడం వట్టి సమస్యలు తలెత్తుతాయి. యూరోపియన్ పర్యావరణ సంస్థ వెల్లడిలో 55 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉండే రహదారి ట్రాఫిక్ మోతల వల్ల 5 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రబావితం అయ్యారని తేలింది. డబ్ల్యూహెచ్ఓ సైతం అదేవిషయాన్ని ఉటంకించింది. 55 డీబీలకు మించిన శబ్ధం జంతువులకు, మానవాళికి హానికరమని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ అవాంఛిత ధ్వనిని అరికడదాం… రాబోయే తరాన్ని శబ్ధ కాలుష్యం నుండి కాపాడుకుందాం.
-రమేష్, ఫ్రమ్ టుమారో ఆర్గనైజేషన్.