నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ్ సర్వేక్షన్ లో మొదటి స్థానాన్ని సాధించాలని డిప్యూటీ కమిషనర్ వెంకన్న జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి సూచించారు. శేరిలిగంపల్లి సర్కిల్ 20 కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకన్న ఆధ్వర్యంలో స్వచ్ఛ్ సర్వేక్షన్ 2022 లో భాగంగా శానిటేషన్ విభాగం సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ్ సర్వేక్షన్ ర్యాంకింగ్ సర్వే లో మన నగరానికి మెరుగైన ర్యాంక్ వచ్చేలా పాటుపడాలన్నారు. అందుకోసం శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కాలనీ, బస్తీ సంఘాల ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షన్ పోర్టల్ లో సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని, అలాంటి ప్రాంతాలను గుర్తించి చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని నిషిదించాలని, దుకాణాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జరిమానాలు విధిస్తారన్నారు. చెత్తను తడి, పొడిగా వేరు చేసి ఇవ్వాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన చేయరాదని, పబ్లిక్ టాయిలెట్ లను వినియోగించాలని తెలిపారు. ఈ సమావేశం లో డాక్టర్ కేఎస్ రవి, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ మాన్వి, ఎస్ ఎస్ జలంధర్ రెడ్డి , ట్రాన్స్‌పోర్ట్ AE అనురాగ్, ఎస్ ఆర్ పీ, ఎస్ ఎఫ్ ఏ లు పాల్గొన్నారు.