విలేఖ‌రుల‌ను వాడుకొని వ‌దిలేయ‌డం కాదు… ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా గుర్తించి అండ‌గ నిల‌వాలి: గ‌జ్జ‌ల యోగానంద్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి వారికి వెంట‌నే కోవిడ్ వ్యాక్సిన్ వేయించి అన్నివిధాలా ఆదుకోవాల‌ని బిజెపి శేరిలింగంప‌ల్లి ఇన్చార్జీ గ‌జ్జ‌ల యోగానంద్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచార సేవల ద్వారా సమాజ నిర్మాణానికి తోడ్పాటును అందిస్తున్న జర్నలిస్టులు నేటి కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్న‌రని అన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు పలువురు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జర్నలిస్టులకు ఏ విధమైన సహాయం అందించలేక‌పోవ‌డం బాదాక‌ర‌మ‌న్నారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి వారికి తక్షణం కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ అందేలా ఉత్తర్వులు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికే 15 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాయ‌ని అన్నారు.

గ‌జ్జ‌ల యోగానంద్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచీ విలేఖ‌రుల‌ను వారి అవసరాలకు వాడుకొని రాజకీయంగా ఎదిగిన తర్వాత జర్నలిస్టులను ఏమార్చారన్నారు. విలేఖరుల‌కు ఇళ్లస్థలాలు ఇస్తామని ఎన్నికల ముందు టీఆరెస్ మేనిఫెస్టోలో కూడా ప్రకటించార‌ని, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్దిరోజులకే విలేఖ‌రుల‌తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వారి కోసం పలు సంక్షేమ పథకాలు ప్రకటించి నేటికి ఒక్కటైనా నెరవేర్చిన దాఖలాలు లేవ‌ని ఎద్దేవా చేశారు. కోర్టుల సాకులు చెబుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించకుండా జాప్యం చేస్తున్నార‌ని, జంటనగరాల చుట్టూ ఎన్నో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయ‌ని, అర్హులైన విలేఖరులందరికి ఇండ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలన్నారు. ఇల్లు కూడా లేని నిరుపేద జర్నలిస్టులు కరోనా కోరలకు బలైపోయి వారి కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయ‌ని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై స్పందించారు. కాబట్టి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here