నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విజృంభన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి లోబడి నడుచుకోవాలని మియాపూర్ డివిజన్ ప్రజలకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి లాక్డౌన్ మినహా మరో మార్గం లేని తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని, ప్రజలు అందుకు కట్టుబడి ఉండాలని కోరారు. అత్యవసరం ఐతే తప్ప బయటకు వెళ్లరాదని, వెళ్లాల్సివస్తే విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎలాంటి అవసరం తలెత్తిన తనని సంప్రదించాలని ఎప్పటిలాగే లాక్డౌన్లోను డివిజన్ ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు.