స‌న్న బియ్యం పంపిణీలో నిరుపేద‌ల ఇళ్ల‌లో వెలుగులు: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మే 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ వేముకుంట‌ బస్తీలో సన్నబియ్యం లబ్దిదారుల ఇంటికి రంగారెడ్డి జిల్లా మహిళ డిసిసి అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్, జై బాపు జై భీమ్ జై సంవిధన్ అబ్సర్వర్ రమేష్ గుప్త, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వి.జగదీశ్వర్ గౌడ్ రుచి చూశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు సునీతని ఆరా తీశారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని ఆమె సమాధానమిచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. సన్నాలను ప్రోత్సహిస్తూ రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలిచిందని, గడిచిన సీజన్లో సన్నాలకు రూ.1.199 కోట్ల బోనస్‌ను రైతుల ఖాతాలో జమ చేశామ‌ని తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాల పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నార‌ని అన్నారు.

టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్లా సంజీవ్ రెడ్డి, శేరిలింగంపల్లి మైనార్టీ చైర్మన్ అజీం, మాజీ కౌన్సిలర్ రఘుపతిరెడ్డి, నియోజకవర్గ నాయకులు మహిపాల్ యాదవ్, మిరియాల రాఘవరావు, వీరేందర్ గౌడ్, కట్ల శేఖర్ రెడ్డి, ఉరిటి వెంకట్ రావు, డివిజన్ అధ్యక్షులు అలీ, బాష్పక్ యాదగిరి, మారేలా శ్రీనివాస్, జహంగీర్, డిసిసి ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సురేష్ గౌడ్, రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అభిషేక్ గౌడ్, విక్రమ్, పట్వారీ శశిధర్, యలమంచి ఉదయ్ కిరణ్, జావీద్, గౌస్, రామచందర్, కిట్టు, సంగమేష్, మునాఫ్ ఖాన్, రాము, రెహమాన్, అయాజ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీహరిగౌడ్, నితిన్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, దుర్గేష్, ప్రవీణ్, నందు, దిలీప్, నర్సింగ్ రావు, సుస్మిత, శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక, బ్లాక్ ప్రెసిడెంట్లు భాగ్యలక్ష్మి, శ్రీదేవి, పార్వతి, లక్ష్మి, జయ, సుస్మిత, కవిత, శాంత, లలిత, దివ్య, అరుణ యాదవ్, కృష్ణ కుమారి, కృష్ణ వేణి, లక్ష్మీ దేవి, మేరీ, లోకేశ్వరి, నాగలక్ష్మి, యోగేశ్వరి, లోకేశ్వరి, నాగలక్ష్మి, యోగేశ్వరి, రెడ్డి, అనిత, పార్వతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here