శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ కార్యాలయం ముందు ఓంకార్ నగర్ వాసుల సమస్యలను పరిష్కరించాలని యంసిపీఐ (యు) మియాపూర్ డివిజన్ కార్యవర్గ సభ్యురాలు జి లలితా అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి యంసిపీఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ లో వెనుకబడిన వర్గాలు నిరుపేదలు గత 25 సంవత్సరాల నుండి ఇండ్లు నిర్మించుకొని ఆ సౌకర్యాలతో ఎలాంటి మౌలిక సదుపాయ లేకుండా గుంటలు తొవ్వుకొని నీరు త్రాగి అనారోగ్య బారిన పడుతున్నారు. అయినా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు హైటెక్ సిటీకి ఆమడ దూరంలో ఉన్న ఈ పేద ప్రజలకు పట్టించుకొనే నాధుడు లేకుండా పోయారు. స్థానిక కార్పొరేటర్ పేద ప్రజల ఓట్లు అవసరమే తప్ప వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి చర్య తీసుకోకుండా బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
నాయనమ్మ కుంట చెరువు అభివృద్ధి పేరుతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని చెబుతూ చెరువు కట్టను తమ ఇష్టానుసారంగా మలుపుతూ పక్కనే ఉన్న ఆక్రమణదారులకు వంత పాడుతూ వారికి అనుకూలంగా చెరువు కట్టను మలుపులు తిప్పడంతో పేద ప్రజలకు శాపంగా మారింది. భారీగా మట్టి ఎత్తు పోయడం వలన పక్కనే ఉన్న ఓంకార్ నగర్ వర్షం వచ్చినా మునిగిపోయి ఇండ్లలో వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఓంకార్ నగర్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించకుండా చెరువు కట్ట ఎత్తు పెంచడం వలన ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పలుసార్లు కార్పొరేటర్, అధికారుల దగ్గరికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రజా ఆందోళన ద్వారానే అధికారులు, రాజకీయ నాయకుల మెడలు వంచి పనులు చేపిస్తామని అన్నారు.
చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ ని కలిసి సమస్య వివరించగా సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలోయంసిపిఐ (యు)మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి, పార్టీ గ్రేటర్ నాయకులు అంగడి పుష్ప, విమల, డివిజన్ నాయకులు శివాని, జంగయ్య, ఇషాక్, బస్తీ వాసులు పాల్గొన్నారు.