అంబేద్క‌ర్‌ను అవ‌మాన ప‌రుస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మే 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహనీయుల ఆశయాలను కాపాడటంతోపాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశ వ్యాప్తంగా జై-బాపు జై-భీమ్ జై-సంవిధాన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్ట్ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రను జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ చైర్మన్ జేరిపేటి జైపాల్, రంగారెడ్డి జిల్లా మహిళ డిసిసి అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్, జై బాపు జై భీమ్ జై సంవిధన్ అబ్సర్వర్ రమేష్ గుప్త, కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులు కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ ఏఐసీసీ, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుట్ట అమిత్ రెడ్డి నేతృత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఘనంగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. అహింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింపచేసిన మహాత్మా గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం ‌రచించిన అంబేద్కర్ లను ‌బిజెపి ఆర్ఎస్ఎస్‌ అవమాన పరుస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు ‌వ్యతిరేకంగా‌ ‌చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి మైనారిటీ చైర్మన్ అజీమ్, మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, మహిపల్ యాదవ్, మిరియాల రాఘవ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, వీరేందర్ గౌడ్, కట్ల శేఖర్ రెడ్డి, విరేశం గౌడ్, ఉరిటీ వెంకట్ రావు, డివిజన్ అధ్యక్షులు అలీ, బాష్పక యాదగిరి, మారేలా శ్రీనివాస్, డిసిసి ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సురేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ అభిషేక్ గౌడ్, ఏకాంత్ గౌడ్, విక్రమ్, పట్వారీ శశిధర్, కార్తిక్ గౌడ్, గఫుర్, యాలమంచి ఉదయ్ కిరణ్, జవీద్, గౌస్, సత్య రెడ్డి, భరత్, రామచందర్, కిట్టు, నందు, గోపాల్ గౌడ్, సంగమేష్, మునఫ్ ఖాన్, రాము, రెహ్మాన్, ఆయాజ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీహరి గౌడ్, నితిన్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, దుర్గేష్, సాయి కిషోర్, ప్రవీణ్, నందు, దిలీప్, నర్సింగ్ రావు, సుస్మిత, రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాద్యక్షురాలు కల్పన ఏకాంత్ గౌడ్, శేరిలింగంపల్లి మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక, బ్లాక్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి, శ్రీదేవి, పార్వతి, లక్ష్మీ, జయ, సుస్మిత, కవిత, శాంత, లలిత, దివ్య, అరుణ యాదవ్, కృష్ణ కుమారి, కృష్ణ వేణి, లక్ష్మీ దేవి, మేరీ, లోకేశ్వరి, నాగలక్ష్మి, యోగేశ్వరి, లీల, జాబినా, సారా ఖాన్, తన్విర్ బేగం, శ్రీజ రెడ్డి, అనిత, పార్వతి, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here