శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): TGSPDCL కు చెందిన గచ్చిబౌలి డివిజన్ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు మారినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలకు సంబంధించి వినియోగదారులు పాత ఫోన్ నంబర్లను తీసేసి తాము అందజేస్తున్న కొత్త ఫోన్ నంబర్లను సేవ్ చేసుకోవాలని, వాటి ద్వారానే ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని వారు సూచించారు. కొత్త ఫోన్ నంబర్లను వినియోగదారులు గమనించాలని కోరారు.