పరవశింపజేసిన త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు శిల్పారామంలో ఆఖరి రోజు నగర సంకీర్తనతో మొదలైంది. త్యాగరాజ పంచరత్న గాన సేవకు నాలుగు వందలకు పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పద్మశ్రీ కన్యాకుమారిని సంస్కృతి ఫౌండేషన్ సన్మానించింది. సాయంత్రం పద్మశ్రీ కన్యాకుమారి కచేరీ శ్రోతలను పరవశింప చేసింది. దేవగాంధారి రాగంలో క్షీర సాగర శయన కృతిని అద్భుతంగా వాయించారు. ఆవిడకు మృదంగం పై విద్వాన్ బీవీఎస్ మూర్తి, కంజీరా పై విద్వాన్ శ్యామ్ కుమార్ వాద్య సహకారం అందించారు.

దేవగాంధారి రాగంలో క్షీర సాగర శయన కృతిని వాయిస్తున్న పద్మశ్రీ కన్యాకుమారి బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here