శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి విభాగం అధికారులతో కలిసి కాలనీ లో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్లు వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రశాంత్ నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ ,మేనేజర్ ప్రశాంతి, GHMC AE రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.