అమ‌రుల త్యాగ ఫ‌ల‌మే నేడు మ‌నం అనుభ‌విస్తున్న తెలంగాణ‌: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూన్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు , మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు వందనం సమర్పించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నాం అని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అన్నారు. అమరుల త్యాగాల ఫలితంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి సంక్షేమం, అభివృద్ధి అనే మార్క్ ను చేసి చూపిస్తామని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో నే అగ్రగామి నియోజకవర్గం గా తీర్చిదిద్దుతాన‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు,నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here