బీఆర్ఎస్ పార్టీ ఆర్య వైశ్య కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా కొకళ్ల బాలరాజు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆర్య వైశ్య కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా నియమితులైన కొకళ్ల బాలరాజుని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి అభినందించారు అనంతరం శుభాకాంక్షలు తెలిపి బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చెప్పారు. తమ పరిసర ప్రాంతాల, కాలనీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఏ సమస్యయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీల అభివృద్ధి కి పాటుపడాలని, ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆకారం వెంకటేష్ గుప్తా, బాదం శర్వలింగం గుప్తా, మాడ్యాం బాలాజీ గుప్తా, మారం లక్ష్మీనారాయణ గుప్తా, కండెమిల్లి శివరామకృష్ణ, శివరాజు గుప్తా,భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

కొకళ్ల బాలరాజుని శాలువాతో సన్మానించి అభినందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here