శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నాం అని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అన్నారు. అమరుల త్యాగాల ఫలితంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి సంక్షేమం, అభివృద్ధి అనే మార్క్ ను మీ ఆశీస్సులతో అభివృద్ధి మార్క్ ను చేసి చూపిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.