దోమ కాటుకి గురి కాకుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి: కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి, జూన్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దోమ కాటు నేటి రానున్న వర్షాకాలం రోజులలో చాలా ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దోమ కాటుకి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో వన్ డే- వన్ వార్డు ఏంటోమాలజీ కార్యక్రమాన్ని కొండాపూర్ డివిజన్ వార్డు కార్యాలయం నుండి స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, సిబ్బందితో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంజయ్య నగర్ కాలనీ వీధుల్లో స్థానిక నాయకులు, అధికారులు, సిబ్బందితో కలసి దోమల‌ నివారణ, వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, ఆవశ్యకత వంటి విషయాలపై ప్రజలలో అవగాహనా కల్పిస్తూ పాదయాత్ర చేశారు.

ఈ సందర్బంగా అంజయ్య నగర్ కాలనీలో పలు వీధులలో ఉన్న చెత్తను సిబ్బందితో క‌లిసి తొలగించారు. ప్రతి ఇల్లు తిరుగుతూ అశుభ్రతగా ఉన్న ఇండ్లలో ఉన్న వారికి వారి పరిసరాలపై అవగాహనా కల్పిస్తూ శుభ్రతను పాటించాలని దోమల‌ నివారణ కోసం చేయాలసిన చర్యల‌ను గురించి కార్పొరేటర్ హమీద్ పటేల్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏంటోమాలజీ ఏఈ తనూజ, ఇంచార్జి అబ్దుల్ సత్తార్, సూపెర్వైజర్ లత, మహేందర్, శానిటేషన్ సూపెర్ వైజర్ కిరణ్ కుమార్ రెడ్డి, యస్ఎఫ్ఏ రమేష్, హెల్త్ డిపార్ట్మెంట్ విజయ్, సీనియర్ నాయకులు నరసింహసాగర్, రూప రెడ్డి, రఫియా బేగం, జుబెర్, స్వామి సాగర్, ప్రవీణ్ గుప్తా, ఆంజనేయులు సాగర్, సాయి బాబా సాగర్, తిరుపతయ్య, కృష్ణ, ఆంజనేయులు, సీతా రామ్, రవి, చెన్నయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here