బీసీలంద‌రూ ఏక‌తాటి పైకి రావాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బహుజన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ప్రణాళిక, సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల బీసీ సంఘాల ఐకమత్యం కొరకు సమీకరించే కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ముదిరాజ్ సంఘాలన్నింటిని ఏకం చేసే కార్యక్రమంలో భాగంగా పుష్ప లత బృందం పాదయాత్ర యాదగిరిగుట్ట నుండి అసెంబ్లీ గన్ పార్క్ వరకు చేసినందున ముగింపు సమావేశంలో స్వాగతం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో యువ నాయకుడు, సంఘం ప్రధాన కార్యదర్శి శివ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఐకమత్యంతో సమస్యల పరిష్కారం కొరకు బీసీలు అందరిని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌ని కలుపుకొని వెళ్దామ‌ని అన్నారు. ముదిరాజ్‌ల‌ను బిసి ఎ గ్రూప్‌లోకి మార్చాల‌ని అన్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను అన్ని రంగాల్లోనూ క‌చ్చితంగా అమ‌లు చేయాల‌న్నారు. ఈ స్వాగత సమావేశంలో యువజన నాయకులు సత్యం ముదిరాజ్, చిరంజీవి ముదిరాజ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం మల్లికార్జున్ ముదిరాజ్, మహిళా సంఘాలు, ముదిరాజ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here