అవ‌య‌వ దానం చేసేందుకు అంద‌రూ ముందుకు రావాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడ లో ఉన్న‌ మై హోమ్ జ్యూవల్ అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ లో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం, తెలంగాణ శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో 30 మంది గాంధీ మెడికల్ కాలేజీకి తమ టోటల్ బాడీస్ ని డొనేట్ చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ అభినందన పత్రాలు, డోనర్ కార్డ్స్ ల‌ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, విశిష్ట అతిథిగా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, ఆత్మీయ అతిధులుగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డా. కాట్రగడ్డ భారతి, గురు ప్రకాష్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రశాంత్, సంఘ ఉపాధ్యక్షురాలు చాపరాల ఇందిర, సహాయ కార్యదర్శులు రజని శ్రీనివాస్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అందజేశారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మరణం తరువాత జీవించండి అన్న నినాదం సామాజిక సేవా జీవితంలో ఎన్నడూ వినలేదని, వట్టి స్లోగన్ ఉంటే సరిపోదు ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక సంస్థ కావాలి, అందుకోసం సీతామహాలక్ష్మీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఒకే సారి 30 మంది దాతలు దేహ దానానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం అని తెలిపారు. సంఘం వాళ్ళు చేస్తున్న సేవ చాలా గొప్పదని ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా వ్యాపించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ , మల్లేష్ గుప్తా, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here