బిల్ఎఫ్ ఐదవ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

  • బిల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్ పిలుపు
ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన బిల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్

నమస్తే శేరిలింగంపల్లి: బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిల్ఎఫ్ ) 5వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని బిల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్ పిలుపునిచ్చారు. బిల్ఎఫ్ ఆవిర్భావ సభ కరపత్రాన్ని మియాపూర్ ముజాఫర్ అహమ్మద్ నగర్ లో ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించడమే బిఎల్ఎఫ్ లక్ష్యమని అన్నారు. తెలంగాణ ఏర్పడినాక సామాజిక తెలంగాణ పేరుతో పాలకులు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అగ్రవర్ణాలలో తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉందని చట్టసభలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు వారి జనాభా ప్రాతిపదిక ప్రకారం గా ఎన్నికలలో సభలకు వెళ్లే అవకాశం లేకుండా రాజకీయాలను కేవలం వ్యాపార ధోరణి తోటి ఉండే విధంగా అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్య భావజాలం కొనసాగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికలలో 119 స్థానాలలో బహుజన అభ్యర్థులను పోటీ చేయించడానికి పార్లమెంట్ శాసనసభ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బహుజనులకే రాజ్యాధికారం లక్ష్యంగా ఈ జనవరి 25న భాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్, బి.యన్ హాల్ లో జరపబోతున్నామని తెలిపారు. సభకు బహుజన ప్రజానీకం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంసిపిపిఐ (యూ ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ , సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు కుంభం సుకన్య శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు పల్లె మురళి,ఈ .దశరత్ నాయక్, గూడా లావణ్య, లాసాని రాజు,కే చుక్క,ఎం రాములు, రవికాంత్, వెంకటేష్, మంగళి రాములు, లక్ష్మణ్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here