శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లిలోని సీపీఐ కార్యాలయం దగ్గర పార్టీ నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికీ అందలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినా పేదవాడు పేదవాడి గానే మిగిలిపోయాడన్నారు. ఉద్యోగాల కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, ఉండేవాడికి ఇల్లు కోసం, భూమికోసం, భుక్తి కోసం మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్, తుపాకుల రాములు, ఏఐటీయూసీ ఎం వెంకటేష్, ఇజ్జత్ నగర్, ఎస్ కొండలయ్య, డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి బి నారాయణ, రఘు, బాలకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.