శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి ఔటర్ రిగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2 కొండాపూర్ వైపు రూ. 446.13 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ ను త్వరలో ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి ఔటర్ రిగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ కొండాపూర్ వైపు రూ. 446.13 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ లో భాగంగా కొండాపూర్ వైపు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధికారులు, ట్రాఫిక్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిల్పా లే-ఔట్ స్టేజ్ 2 ఫ్లైఓవర్ లో భాగంగా కొండాపూర్ వైపు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు తుది దశలో ఉన్నాయి అని, అతి త్వరలో ప్రారంభోత్సవం చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ అధికారులు DE హరీష్, AE శివ కృష్ణ , ట్రాఫిక్ CI సురేష్, నాయకులు గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , జంగయ్య యాదవ్, సత్యనారాయణ, చాంద్ పాషా, శశాంక్, గణపతి, బస్వరాజు, ఖాసీం, ప్రభాకర్ రెడ్డి, నగేష్, బాబు, రాజేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.