శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ వార్డ్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ముఖ్య నాయకులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలో రాగం సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో, ఆరంభ టౌన్షిప్ లో జాతీయ పతాకాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనకోసం భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించి, తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పించి, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలని రాగం నాగేందర్ యాదవ్ గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, అల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకుఉ మిర్యాల రాఘవరావు, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, కొండల్ రెడ్డి, కే రాంచందర్, ప్రొఫెసర్ పసునూరి రవీందర్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఎంపీపీఎస్ హెచ్ఎం పాండురంగ రెడ్డి, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బసవయ్య, పిల్లి యాదగిరి, షఫీ, సుధాకర్ రెడ్డి, రవీందర్, కుటుంబ రావు, మాధవ హిల్స్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరావు, మల్లేష్ యాదవ్, నర్సింహా, ముసలయ్య, రవి, దస్తగిరి, సుగుణరావు, దానయ్య, అజాజ్, రజాక్, అక్బర్, సతీష్, వెంకటేష్, ఖాజా, ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు ఆశ్రఫ్, మౌనిక, వనిత, విజయ, మాధవి, పూజిత, మల్లికాంబ, మహేశ్వరి, ఆరంభ టౌన్షిప్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, అడ్వైసర్ కాంచన, ఈసీ మెంబర్లు ప్రసాద్, రాజ్ కుమార్, హైమ, కృష్ణ శ్రీనివాస్, మాధవ్, సరస్వతి, సత్యనారాయణ, శ్రీనివాస్, కుమార స్వామి, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, సుజాత, కనకలక్ష్మి, ముంతాజ్ బేగం, లక్ష్మి, కుమారి, జయమ్మ, సుధారాణి, సబియా తదితరులు పాల్గొన్నారు.