శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తేజ డాన్స్ స్టుడియోస్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.