సరే ! ఓటు వేయలేదేమో ; వేయలేక పోయారేమో !
అందరూ ఇంతగా దూషించడమా !!
ఏం పీకుతున్నరు ? గాడిదలు కాస్తున్నరా !? మీకు అడిగే హక్కు లేదు !
- ఇవే మాటలను ఓటర్లు రాజకీయపార్టీలను అడిగితే ఎట్లా ఉంటది ! అహా ( ఒక మాట) ! ఎందుకు అనవద్దు ?
- ఓటర్ లిస్ట్ ను ముందుగా పార్టీలు చెక్ చేసుకుంటున్నాయా ! పేర్లు ఎందుకు గల్లంతు అయినాయో తెలుసు కుంటున్నారా ?
- పాత లిస్ట్ లో ఉండి , వందలాది ఓట్లు ఎలా పోతాయి ? ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు చెక్ చెయ్యవు !?
- ఈ విషయం లో సంబంధిత డిపార్ట్మెంట్ ను ఎందుకు నిలదీయవు !?
- ఎలెక్షన్ కమిషన్ కు గాని , కోర్టుకు గాని రిపోర్ట్ చేసి ఎందుకు సరి చేయించవు !?
- వందలాది ఓట్లు కనపడక పోవడం , చనిపోయినవారి పేర్లు ఉండడం గురించి చీమ కుట్టినట్టు అయినా ఉండకపోవడం విచిత్రం !
- ఓటు వేయండి అని చెప్పడం మాత్రమే బాధ్యతనా !?
- అక్రమ మార్గాలలో ఓట్లు వేయించుకోవడం ఒకటే వీరికి తెలిసిన విద్యయా !?
గెలిచి , వెలగబెట్టింది ఏమీ లేదు , గెలిచిన ఒక్క సంవత్సరం లోనే లక్షలు , కోట్లు , కార్లు , భవనాలు , స్థలాలు , దర్పం , గర్వం , నిర్లక్ష్యం మొదలగునవ్వీ వస్తున్నాయె ! ప్రజల సమస్యలు తెలియనే తెలియవాయె, మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే “ ఓటరు దేవుడు ” అవుతాడాయె !
- ఓటర్ కు మనసులో ఏహ్య భావం , ఛీ , థూ అనే భావన రాదా !?
- ఇవన్నీ విషయాలపై ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మ పరిశీలన చేసుకుంటు ఉన్నదా !?
- ఓటర్ కార్డ్ తో ఆధార్ కార్డ్ ను లింక్ ఎందుకు చేయరు ?!
ఆలోచిస్తే , అడిగితే సవాలక్ష ప్రశ్నలు !
ముందు ముందు ” ఓటు వేయను పో ! ” అనే పరిస్థితి వచ్చినా రావచ్చు .
పార్లమెంట్ లో ఓటింగ్ విధానం పై , గెలుపు ఓటముల విధానం , సంపాదించిన ఓట్ల సంఖ్య పైన కూడా సమగ్ర చర్చ జరపడం , చట్టం చేయడం మున్నగునవి చేయవలసిన అగత్యం ఉన్నది !
మనోహరుడి మనోగతం.
కూర్పు: మనోహర్ బోరంచ. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, అపర్ణ సరోవర్, నల్లగండ్ల