శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ కాలనీలో రూ. 35 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ కార్పొరేటర్లు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో రాం నరేష్ నగర్ కాలనీలో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. రాం నరేష్ నగర్ కాలనీలో ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరుతుందని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, UGD వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ, మేనేజర్ ప్రియాంక, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.