శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో స్థానికులతో కలిసి ఆయన విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు అని తెలియజేసారు. అన్న అనే పదానికి మారుపేరు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించి ప్రజా సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన మహానుభావుడు నందమూరి తారకరామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, వల్లభనేని జనార్ధన్ రావు, మోహన్ రావు, బసవేశ్వరావు, చిలుకూరి శ్రీనివాస్, బాలు చౌదరి, ప్రసన్న రెడ్డి, ఎస్. శ్రీనివాస రావు, నరేంద్ర , కిరణ్, జితేంద్ర, డేవిడ్ పాల్, సుధాకర్, రవి, నందమూరి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.