శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న సోఫా కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. వర్షాకాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ అధ్యక్షుడు రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు సుమన్ , వేణు గోపాల్ రెడ్డి , కృష్ణ , హీరియ నాయక్, కలియ నాయక్, శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సోఫా కాలనీ వాసులు, స్థానిక నేతలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.