శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. Ghmc ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి మంజుల రఘునాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యువత ప్రస్తుత విషయాలపై అవగాహన పెంచుకోవాలని ,అన్ని రంగాలలో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు.