శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ ఎన్టీఆర్ సర్కిల్, భాగ్యనగర్, ఎల్లమ్మబండ మరియు పలు కాలనీలలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పీఎసీ ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ లతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకల్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత నేత అని అన్నారు. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించుకుని, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ అన్నిరంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, పవన్ కుమార్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, డివిజన్ల సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.