శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్ట్ డ్ కార్పొరేటర్ మారబోయిన రవి యాదవ్ జన్మదిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని ఆశీర్వదించారు. రవి యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా సుఖ సంతోషాలతో జీవించి సమాజంలో బ్రతుకుతూ మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానని రామచందర్ యాదవ్ అన్నారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, సత్యనారాయణ యాదవ్, అశోక్, ఆటో యూనియన్ కార్యదర్శి, అభిమానులు, యువ నాయకులు, స్నేహితుల పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.