శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలోని రామారావు విగ్రహానికి కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస రావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాహానుభావుడు అని కొనియాడారు. విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, శ్రేయాబిలాషులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.