నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికలు అయిపోయిన ప్రతిసారి గ్యాస్ ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ధ్వజమెత్తారు. ఓ వైపు చమురు ధరలు పెంచుతూ సామాన్యూడి నెత్తిన భారం వేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచి పేదల జేబుకు చిల్లు పెడుతోందని మండిపడ్డారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు, హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు వద్ద కట్టెల పొయ్యి మీద వంటలు వండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని హఫిజ్ పేట్, మాదాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పార్టీ మహిళ కార్యకర్తలు,నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు.