నూతన “గోదావరి కట్స్” స్టోర్  ప్రారంభం

  • అందుబాటులో 40 రకాల నాన్ వెజ్ ఐటమ్స్
  • జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి గచ్చిబౌలి లోని బోటనికల్ గార్డెన్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన “గోదావరి కట్స్” 9వ బ్రాంచ్ స్టోర్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్  ముఖ్య అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ ని పూలబొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సిటీలో ఎక్కడ దొరకని సీ ఫుడ్ వెరైటీస్ నగరంలోని “గోదావరి కట్స్” లో దొరుకుతాయని అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేసి నూతన “గోదావరి కట్స్” స్టోర్ ని ప్రారంభిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

40 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో అందుబాటులోకి రావడం ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు  పొందాలని నిర్వాహకులకు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ గారు “గోదావరి కట్స్” 9వ స్టోర్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి కట్స్ నిర్వాహకులైన జి నాగేశ్వర్ రెడ్డి, రాజేంద్ర తల్లూరి, శ్రీనివాసరాజు, ప్రణీత్, నిఖిల్ రెడ్డి, నిహాల్ రెడ్డి మరియు గోపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు పూలబొకేతో స్వాగతం పలుకుతున్న “గోదావరి కట్స్” స్టోర్ యాజమాన్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here