నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరు నుండి విచ్చేసిన కళాకారిణి రజిని ప్రమోద్ చే భరతనాట్య ప్రదర్శన, కందుల కూచిపూడి నాట్యాలయం గురువర్యులు రవి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. రజిని ప్రమోద్ తన ప్రదర్శనలో పుష్పాంజలి, విజ్ఞ రాజాం భజేయఁ, నీమాటలే మాయనుర , దేవి, అదిసలి యశోద అంశాలను ప్రదర్శించారు. రవి శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహన, వినాయక కౌతం, గరుడ గమన, పుష్పాంజలి, జయము జయము, నమశ్శివాయతేయ్, పలుకీ బంగారమాయెహ్ న, వినరో భాగయము విష్ణు కథ, జతిస్వరం, దశావతార శబ్దం, భో శంభో మొదలైన అంశాలను మణిమాల, వర్ష, గిరిష్మ, తన్మయి, శాన్వి, శ్లోక, మహతి, నందిత, కార్తీక, సహస్ర, అద్విక, ప్రగ్న్యకార్తిక, నాగ సాహితి, కమల మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
