మయూరి నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, జూలై 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అంద‌జేశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. కాలనీలో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. మియాపూర్ డివిజన్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండడం జరుగుతుందని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్, రామరాజు, హరికృష్ణ, రామిరెడ్డి, నాగరాజు, రమణ రెడ్డి, కృష్ణ కుమార్, ఈశ్వరయ్య, జానీ బాషా, సచిన్ కుమార్, రఘు రామరాజు, వెంకట్, వేణు, ఎన్ నాగరాజు, అమర్, శ్రీనివాస్, వరలక్ష్మీ, కృష్ణ మూర్తి, ఫ్రాన్సిస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here