PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఆర్యవైశ్య మహాసభ మండల సంఘం తర‌పున కొత్తగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కొండాపూర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ పబ్బ మల్లేష్ గుప్తా, మండల మాజీ అధ్యక్షుడు గంప సత్య నారాయణ గుప్తా, కొండాపూర్ సంఘం నూతన ప్రెసిడెంట్ కామిశెట్టి జగదీష్, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వరరావు వల్లభు, వైస్ ప్రెసిడెంట్ అర్థం సురేష్, అడిషనల్ సెక్రెటరీ గంప సంతోష్, ఆర్గనైజ్ సెక్రెటరీ ఉప్పగుండ్ల ఆనంద్, జాయింట్ సెక్రెటరీ మిడిదొడ్డి రాజేష్, చింత శ్రీనివాస్, సంఘ సభ్యులు సంపత్ గుప్తా, వనమా శ్రీనివాస్ గుప్తా, జయకృష్ణ గుప్తా, పృథ్వీ గుప్తా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here