నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు చైతన్యవంతంగా ముందుకు కదిలినప్పుడే సమాజం మారుతుందని ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుండి 23 వరకు ఏఐఎఫ్డీడబ్ల్యూ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా స్టాలిన్ నగర్ లో స్టాలిన్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సుకన్య మాట్లాడుతూ… ప్రస్తుత పురుషాధిపత్య సమాజంలో మహిళలు ఇంకా అణిగిమనిగి ఉండవలసిన అవసరం లేదని, మారుతున్న పరిణామ క్రమానికి అనుగుణంగా చైతన్యవంతం కావలసిన అవసరం ఉందన్నారు. మహిళలకు హక్కులు, సమానత్వం,స్వేచ్ఛ కోసం పోరాడాలని మహిళా చైతన్యమే సమాజ మార్పుకు దోహద పడుతుందని అన్నారు.
ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పి భాగ్యమ్మ మాట్లాడుతూ.. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 15 రోజులపాటు ఘనంగా జరుపుతున్నామని మహిళలు మరింత ఉత్సాహపూరితంగా, స్వేచ్ఛగా సమాజంలో ముందుకు సాగడానికి స్టాలిన్ నగర్ లో నిర్వహించిన క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వివిధ క్రీడలలో గెలుపొందిన వారికి కుంభం సుకన్య, పి.భాగ్యమ్మ, ఎం రాణి, దారా లక్ష్మి, ఎం.రమేష్, ఎన్.గణేష్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏ.శంకర్, వనం రాధ, వనజ, కే.లావణ్య, చెన్నమ్మ, అనురాధ, చిట్టి, కే.లక్ష్మి, లత, భాగ్యలక్ష్మి, సుజాత, యల్.లక్ష్మి, నాగమణి, సమీన పాల్గొన్నారు.