శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి గ్రామంలో సేవాభారతి ఎల్సిహెచ్ గ్రీన్ ల్యాండ్స్ డా.ఈశ్వర్ చందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. అదే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






