విద్యార్థులు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూలై 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ ను ప్రిన్సిపాల్ ఉమావెంకట్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఎన్నికైన విద్యార్థుల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ లో ఎన్నికైన విద్యార్థులకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానని అన్నారు. ఎన్నికైన విద్యార్థులు నిర్వహించాల్సిన బాధ్యతను గూర్చి సభాముఖంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో తెలియజేశారు. మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, గీతాంజలి విద్యాసంస్థల అధినేత పుట్టి శ్రీనివాసరావు, వివేకానందనగర్ గీతాంజలి బలంపియాడ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ పసుపులేటి ఉవకా వెంకట్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, MD ఇబ్రహీం, చంద్రమోహన్ సాగర్, శివ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here