ఎస్‌టీపీ లైన్ స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్ కాలనీల మధ్య ఉన్న STP లైన్ లో తలెత్తిన సమస్య పరిష్కారానికి సూపర్ సక్కర్ యంత్రంతో చేపడుతున్న పునరుద్ధరణ పనులను సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్ కాలనీల మధ్య ఉన్న‌ STP లైన్ లో తలెత్తిన సమస్య ను సూపర్ సక్కర్ యంత్రం ద్వారా పనులు చేపడుతున్నాం అని తెలిపారు. STP లైన్ లో పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. STP లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన, కుచించుకోపోవడం వలన కాలనీలో మురుగు సమస్య తీవ్రమైంద‌ని అన్నారు. STP ఔట్ లెట్ ను సరి చేసి డ్రైనేజి సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు STP విభాగం GM వాస సత్యనారాయణ, DGM భార్గవి, మేనేజర్ శిరీష, నాయకులు సందీప్ రెడ్డి, సాదిక్, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here