లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

  • టి ఎస్ పి ఎస్ సి ( TSPSC ) చైర్మన్ ను బర్తరఫ్ చేయాలి
  • కామ్రేడ్ ఇస్లావత్ దశరథ్ నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ 

నమస్తే శేరిలింగంపల్లి: టీ ఎస్ పి ఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ అంశంపై సీటుతో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీకి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ నైతిక బాధ్యత వహించాలని ఎంసిపిఐ యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు, కామ్రేడ్ ఇస్లావత్ దశరథ్ నాయక్ అన్నారు. మియాపూర్ లోని ముజఫర్ అహమ్మద్ నగర్ ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థ నే పేపర్ లీకేజీతో రోడ్డున పడేశారని ఏద్దేవా చేశారు. బోర్డు అధికారులను బర్తరఫ్ చేయాలని,రాష్ట్ర ప్రభుత్వానికి తెలవకుండా జరిగిందా, ఇప్పటికైనా లిక్కర్ కేసు నుండి కవితను కాపాడే పని మానుకొని పేపర్ లీకేజ్ అంశంపై దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కష్టపడి ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కోర్టుకు వెళ్లకుండా నిర్వహించిన ఒకే ఒక నోటిఫికేషన్..  వైన్ షాప్ నోటిఫికేషన్ తాగండి ఊగి చావండి అని ప్రజల జీవితాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు.  నిరుద్యోగ యువతకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా కన్న కలలు, చేసిన శ్రమ తల్లితండ్రుల ఆశలు కండ్ల ముందే ఆవిరిలై భయఆందోళనలతో ఆత్మహత్య చేసుకుని యువత ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించి, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here