నేరెళ్ల చెరువులో మొక్క‌లు నాటిన కొత్త‌గూడ గ్రామ‌స్తులు

శేరిలింగంప‌ల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వర్గం ప‌రిధిలోని కొత్త‌గూడ గ్రామం నేరెళ్ల చెరువులో గ్రామ‌స్తులు మొక్క‌లు నాటారు. గ్రామంలో ఉన్న జ‌మ్మి చెట్టు ఎండిపోవ‌డంతో 3 జ‌మ్మి మొక్క‌లతోపాటు 1 వేప చెట్టును, 1 రావి చెట్టును నాటారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ చెట్టు ఎండిపోవ‌డంతోనే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ఒక చెట్టు పోతే అందుకు బ‌దులుగా 3 చెట్లు ఉండాల‌నే ఉద్దేశంతోనే ఈ మొక్క‌ల‌ను నాటిన‌ట్లు వివ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల స్పృహ‌ను క‌లిగి ఉండాల‌ని, మొక్క‌ల‌ను నాటాల‌ని, చెట్ల‌ను పెంచాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here