ఆదిభట్ల శ్రీ‌చైత‌న్య‌లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ వేడుక‌లు

శేరిలింగంపల్లి, జూలై 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆదిభట్ల శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల బాధ్యతలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించ‌డంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల నిర్వహించారు. ఒక దేశాన్ని నడపాలన్న సమర్థవంతమైన బాధ్యతల నిర్వహణ నైపుణ్యం ఎంతైనా అవసరమని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏ జీ ఎం సతీష్ అన్నారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వాలీబాల్ శ్రీనివాస్ హాజ‌రై మాట్లాడుతూ శ్రీ చైతన్య శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు సామూహిక జీవనం సాంఘిక అవగాహన నిర్వహణ సామర్థ్యాన్ని కూడా విద్యార్థులలో నింపేందుకు పనిచేస్తుందన్నారు. విద్యార్థులకు ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించి గెలుపొందిన వారికి బ్యాడ్జీలను బహుమతిగా అందించారు. స్కూల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ తోపాటు క్రీడా సాంస్కృతిక ప్రతినిధులుగా గెలిచిన వారికి వారి వారి బాధ్యతలను తెలియజేస్తూ వాటిని సక్రమంగా నిర్వర్తించవలసిందిగా ఉద్బోధించారు. విద్యార్థులు చిన్నప్పటినుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని తెలియజేశారు. ఇందులో భాగంగా ముందుగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్స్ పుల్లారావు, రవి, ప్రిన్సిపల్‌ సతీష్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్ వాహిని, డీన్స్ మహిపాల్ , సాయికుమార్, ఏవో వెంకటేశం, ఇస్మాయిల్, జోనల్ ఇంచార్జ్ అయోధ్య, పి ఈ టి లు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here