శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల SC బస్తీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని పలువురు కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నల్ల గండ్ల SC బస్తీ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో శ్మశాన వాటిక ను అభివృద్ధి చేయాలని, ప్రహరీ గోడ ను నిర్మించాలని, మంచి నీటి వసతి కోసం బోర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, బర్నింగ్ ఫ్లాట్ ఫార్మ్ లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నల్ల గండ్ల SC బస్తీ శ్మశాన వాటిక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, నిధులు మంజూరు చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. శ్మశాన వాటిక లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, నల్లగండ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, శ్మశాన వాటిక ను అన్ని హంగులతో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని, స్నానపు గదులు, మంచి నీటి వసతి , దహన సంస్కరణ వాటిక, విద్యుత్ దీపాలను, సీసీ రోడ్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ, నల్లగండ్ల వాసులు రాజేంద్ర, ప్రభాకర్, డానియల్, చందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






