శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీలో ఉన్న శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం, శ్రీ మైసమ్మ తల్లి దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ బోనాల సందర్భంగా ప్రతి ఆలయం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రశాంత వాతావరణం కల్పించామని అన్నారు. బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






