శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు కాలనీలో ఏర్పాటు చేసిన RR జ్యువలరీ షావును పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా RR జ్యువలరీ షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, జే. బలరాం యాదవ్, తిరుపతి యాదవ్, సుద్దపల్లి విజయ్ కృష్ణ, రాజమోహన్ రావు, విజయ్ కుమార్ రెడ్డి, తోట నారాయణ పాల్గొన్నారు.






