మనిషిని “మనీషిగా” మలిచే గురువుకు “నమస్తే”

ఒక పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ వేడుకలకు మండల విద్యాధికారి వచ్చారు. ఆయనను చూసిన ప్రధానోపాధ్యాయుడు తోటి ఉపద్యాయులతో కలిసివెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన ఒకపిల్లవాడు ఎంఇఓ గొప్ప వాడు అను కున్నాడు .కొంత సేపటికి జిల్లా విద్యాధికారి వచ్చారు. అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆయనను ఆహ్వానించారు. కొంత సేపటికి విద్యాశాఖమంత్రి వచ్చారు.అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు.ఆపిల్లవాడు అందరి కంటే విద్యాశాఖ మంత్రి గొప్పవాడు అని అనుకున్నాడు. కార్యక్రమం ముగిసిన తరువాత విద్యాశాఖ మంత్రి ప్రక్క సందులో నడచి వెళ్ళాడు. కూడా మిగత నలుగురు కూడా వెళ్ళారు.సందులో ఒక గుడిశ ఇంటిలోనికి అందరూ వెళ్ళారు.అక్కడ పాత మంచం మీద ఒక పెద్దాయన పడుకుని ఉన్నారు.ఆయనతో మంత్రి అయ్యా నేను ముత్తుని వచ్చి ఉన్నాను.అన్నారు.అందుకు ఆపెద్దాయన ఏముత్తు అని అన్నారు.అయ్యా మీదగ్గర చదివిన ముత్తుని.అప్పుడప్పుడ నన్ను అల్లరివాడివి అనేవారు.తుంటరివాడా అనేవారు.ఆతుంటరి వాడిని ఇప్పుడు మంత్రిగా ఉన్నానుఅనిచెప్పి ఆపెద్దాయన కాళ్ళకు నమస్కరించాడు.ఇదంతా చూస్తున్న పిల్లవాడు లోకంలో ఉపాధ్యాయుడే అందరి కంటే గొప్ప వాడు. అందు వలన నేను బాగా చదివి మంచి ఉపాధ్యాయుడు అవుతాను అని నిర్ణయించుకున్నాడు.

ఈ చిన్న సందేశంలోనే గురువు యొక్క గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అజ్ఞానంధకారంలో మునిగి ఉండే విద్యార్థిని చదువు అనే వెలుగుతో జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దే గురువులకు మనం ఆజన్మాంతం రుణపడి ఉండాల్సిందే. కరోనా సమయంలోనూ ఎన్నో ప్రయసలకోర్చి తమ విద్యార్థులకు సాంకేతిక మాధ్యమాల ద్వారా విద్యా బోధన చేయాలని పరితపించే ఉపాధ్యాయుల కృషిని తప్పక ప్రశంసించవలసిందే.

భావి భారత పౌరులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ప్రతీగురువుకు పాదాభివందనాలు తెలుపుకుంటూ గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here