నమస్తే శేరిలింగంపల్లి: ఆటలోనైనా, పాటలోనైనా…రంగమేదైనా ఆడవాళ్లు అన్నింటా ముందుంటున్నారు. కారు నడిపేందుకైనా, కల్లు గీసేందుకైనా, కరెంటుపోలు కూడా ఎక్కగలమని, ప్రతిభలో మగవారికేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు మగువలు. కంప్యూటర్ మీద ప్రోగ్రామ్ చేయడమే కాదు, అవసరమైతే కారు రిపేరు కూడా చేయగలనని, చేసి చూపిస్తోంది మదీనాగూడకు చెందిన వీరంకి రాజ్యలక్ష్మి. తమ కారు సర్వీసింగ్ షెడ్డులో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తల్లిదండ్రులకు కుమారులే కాదు.. కూతుళ్లైనా రక్షగా ఉండగలరని రక్షాబంధన్ సాక్షిగా చాటి చెబుతోంది.
శేరిలింగంపల్లి ప్రాంతంలో నివాసముండే వీరంకి వేంకటేశ్వర్లు గంగారం చౌరస్తాలో అంజన వీల్స్ అండ్ టైర్స్ పేరుతో వీల్ అలైన్‌మెంట్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఇతని పెద్ద కుమార్తె రాజ్యలక్ష్మి ఎమ్ఎన్ఆర్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే కళాశాలకు వెళ్లివచ్చిన తర్వాత దొరికే ఖాళీ సమయంలో తండ్రి సర్వీసింగ్ సెంటర్ కు వచ్చి టైర్లు భిగించడం, వీల్ అలైన్‌మెంట్ చేయడంలో సహాయం చేస్తూ ఔరా అనిపిస్తుంది. వెహికిల్ రిపేరింగ్ పనులు చేసేందుకు అబ్బాయిలు కూడా నామూషీగా ఫీలయ్యే కాలంలో ఎలాంటి భేషజాలకు పోకుండా తండ్రికి అండగా నిలుస్తుంది రాజ్యలక్ష్మి.
తండ్రి వేంకటేశ్వర్లుతో కలిసి వీల్ అలైన్‌మెంట్ సెంటర్లో పనిచేస్తున్న రాజ్యలక్ష్మి
Nice article