బీసీలంద‌రూ ఐక్యంగా ముందుకు సాగాలి: సినీ న‌టుడు సుమ‌న్

శేరిలింగంప‌ల్లి, మార్చి 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీల‌కు అండ‌గా ఉంటాన‌ని మ‌ద్ద‌తు ప‌లికిన సినీ న‌టుడు సుమ‌న్‌ను బీసీ ఐక్య‌ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సలహాదారు బేరి రామచంద్ర యాదవ్, సంధన వేణి మహేందర నాథ్ యాదవ్, సౌధాని భూమన్న యాదవ్ క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. బీసీల బలోపేతానికి తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో బీసీలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పనకై మద్దతు కావాలని కోరారు. ఇందుకు సుమ‌న్ సానుకూలంగా స్పందిస్తూ తాము సైతం బీసీలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామ‌న్నారు. బీసీల హక్కులకై పోరాటంలో భాగస్వాములమ‌వుతామని అన్నారు. నాయకులు టీఎస్ జిఎం టీవీఎస్ రాష్ట్ర సలహాదారు, జాతీయ బీసీ కౌన్సిల్ మెంబర్ మహేంద్ర నాథ్ యాదవ్, సర్పంచుల ఫోరం వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here