శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గత రెండు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఆ నాయకుల వైఖరిలో ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. చందానగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని విమర్శించారు.
దొర అహంకార పోకడలకు నిదర్శనం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం అంటే విలువ లేదని, గవర్నర్ అంటే అసలు గౌరవం లేదని అన్నారు. రాజ్యంగా బద్దమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయమే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు గత రెండు ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినట్లు ఫలితం ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని, తమ వైఖరి మార్చుకోకపోతే ఇకపై ఏ ఎన్నిక వచ్చినా ఘోర పరాజయం తప్పదని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినెటర్ రఘునందన్ రెడ్డి,మిరియాల ప్రీతం,కటికె రాజు,యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్,డిసిసి నాయకులు విజయభాస్కర్ రెడ్డి,సురేష్ గౌడ్,మన్నెపల్లి సాంబశివరావు,డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి,జహంగీర్,సుధాకర్,సంగారెడ్డి,కృష్ణ యాదవ్,ప్రేమ,ఓబీసీ నాయకులు కిషన్,జవీద్,భరత్,దుర్గేష్,సోషల్ మీడియా కన్వీనర్లు శ్రీహరి గౌడ్,కవిరాజ్,చందానగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధు,నర్సింగ్ రావు,సాయి కిషోర్,మైనారిటీ నాయకులు ఆయాజ్ ఖాన్, జవీద్, దస్తగిరి, ఇంతియాజ్,వెంకట్ నారాయణ,హనీఫ్,మౌలానా,సదీక్,కృష్ణ,మహిళలు తన్వీర్, ప్రియదర్శిని,పర్వీన్,జయ,దుర్గ,శాంత,అజ్నిత తదితరులు పాల్గొన్నారు.