శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అన్నమ స్వరార్చనలో భాగంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయం సంస్థ నుండి కరువది సాయి శ్రావ్య, శిష్య బృందం ఏ. శ్రీగౌరీ, వి. తన్విక సిరి, చి. లాస్య, బి. పర్ణిక, ఓ. కీర్తి, బి. మనస్వి, జి. తాన్యశ్రీ, ఓ. లాస్య, యమ్. మేధ శ్రీ, బి. స్వర్ణ, బి. మిషిక, డి. నేహా, కే. లిక్షిత, పి. సహస్ర సాయి సంయుక్తంగా ఝమ్ ఝమ్ తానన, బ్రహ్మమొక్కటే, శ్రీమన్నారాయణ, భావములోన బాహ్యమునందును, కులుకక నడవరో కోమలాల, నారాయణతే నమో నమో, ఇట్టి ముద్దులాడె బాలుడు, మధురాష్టకం, అష్టపది, వాసుదేవ కృష్ణ, జగడపు చనువుల, అష్టలక్ష్మి స్తోత్రం, అదివో అల్లదిగో శ్రీ హరి వాసము మొదలైన బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమాచార్య సంకీర్తనలకు నృత్య ప్రదర్శనలతో మురిపించి అందరి మన్ననలు పొందారు. అనంతరం కళాకారులకు, అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ నిర్వాహకులు ఙ్ఞాపికలను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.