శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీల మైనార్టీ నాయకులు, హెచ్ఎంటి కాలనీలోని రెయిన్ బో హోమ్స్ కమ్యూనిటీ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆయా కాలనీలు, అపార్ట్‌మెంట్లలో తలెత్తినటువంటి సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ, మంచినీటి కొరత, సమస్యలను విడతల వారిగా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. డ్రైనేజీ, మంజీర మంచినీటి వసతులను మెరుగుపరుస్తామని, మియాపూర్ డివిజన్లో ప్రతి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ మైనార్టీ నాయకులు మోహిన్,యధుల్ల, కాజా, ఇబ్రహీం, భాష, మక్బూల్, మహిబు, అజీమ్, స్థానిక నాయకులు రాజు గౌడ్, విజయ్, పాండు, రెయిన్ బో హోమ్స్ కమ్యూనిటీ సభ్యులు సుధీర్, ప్రకాష్,సంతోష్ రాయ్, మహేష్, వెంకటేష్, చిట్టిబాబు,చెన్నకేశవ, శర్మ,శివ, రామకృష్ణ, సంతోష్, సంపత్ రావు, విద్య సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.